4658 రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
RPF రిక్రూట్‌మెంట్ 2024 : 4658 రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4206 Constable మరియు 452 Sub-inspector నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. RPF Constable Recruitment 2024 మరియు Railway Police SI Notification 02 మార్చి 2024న విడుదల చేయబడింది. అర్హులైన అభ్యర్థులు RRB వెబ్‌సైట్ నుండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే పోలీస్ రిక్రూట్‌మెంట్ 2024 Online Apply ప్రారంభ తేదీ 15 ఏప్రిల్ 2024న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 మే 2024. Railway Police Online Application Form 2024 డైరెక్ట్ లింక్ మరియు నోటిఫికేషన్ PDF ఇక్కడ అందించబడ్డాయి, రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలలో రైల్వే పోలీస్ ఉద్యోగాలు ఒకటి కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి దీనికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం ఇక్కడ మీకు లభిస్తుంది.
Join Our Telegram Group
అప్లికేషన్ ఫీజు :
4658 రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కొద్ది మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది, RPF Constable & SI Recruitment Application Fee 2024 దరఖాస్తు ఫీజు క్రింద ఇవ్వబడ్డాయి.
- SC/ST/Female అభ్యర్థులకు : Rs. 250 రూ.
- UR/OBC అభ్యర్థులకు : Rs. 500 రూ.
- దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది.
ముఖ్య గమనిక : రైల్వేలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక అది ఏమిటంటే మీరు దరఖాస్తుకు చెల్లించినటువంటి ఫీజు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తిరిగి మీకు చెల్లిస్తుంది మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది, దరఖాస్తు పూర్తి అయిన వారికి మొదట రాత పరీక్ష ఉంటుంది ఈ రాత పరీక్ష అని రాసిన అభ్యర్థులకి మీరు చెల్లించినటువంటి ఫీజు తిరిగి పొందుతారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మరియు చివరి తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15/April/2024
- దరఖాస్తు చివరి తేదీ : 14/May/2024
- పరీక్ష తేదీ :
వయస్సు ఎంత ఉండాలి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే మీకు వయోపరిమితి కానిస్టేబుల్‌లకు 18-28 సంవత్సరాలు మరియు సబ్-ఇన్‌స్పెక్టర్లకు 20-28 సంవత్సరాలు 01/07/2024 తేదీలోపు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది SC/ST వారికి 05 సంవత్సరాలు OBC వారికి 03 సంవత్సరాలు.
విద్యార్హతలు
- RPF Constable Qualification పదో తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- RPF SI Qualification ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
Note : SI ఉద్యోగానికి డిగ్రీ చివరి సంవత్సరం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదు కచ్చితంగా ప్రతి ఒక్కరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
ఖాళీల వివరాలు
- RPF Constable – 4028 ఖాళీలు
- RPF SI – 452 ఖాళీలు
జీతం వివరాలు
- ఆర్‌పిఎఫ్ కానిస్టేబుళ్ల పే స్కేల్ రూ. 21700/- ప్లస్ అలవెన్సులు. ఇది Level-3 CPC పే మ్యాట్రిక్స్ జాబ్.
- ఆర్‌పిఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పే స్కేల్ రూ. 35400/- ప్లస్ అలవెన్సులు. ఇది Level-6 Pay Matrix జాబ్.
అప్లై ఎలా చేయాలి
• RPF Constable Apply Online ని RRB అఫీషియల్ వెబ్సైట్ నుండి దరఖాస్తు చేయవలసి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద ప్రచురించడం జరుగుతుంది.
Official Notification PDF Downloads Here
Welcome to jobsaddaintelugu.
thank you..